TG NEWS: ధరణిపై దూకుడు పెంచిన ప్రభుత్వం
ABN, Publish Date - Dec 08 , 2024 | 06:20 PM
ధరణిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ధరణి సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోస అనుభవించామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ధ్వజమెత్తారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచన స్వీకరిస్తామని తెలిపారు. తిరస్కరించిన ప్రతి ఫిర్యాదు ఎందుకు చేశారో కారణం ఉంటుందన్నారు. ధరణిలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. ధరణి నిర్వహణను విదేశీ సంస్థ నుంచి ఎస్ఐసీకి మార్చామని అన్నారు. లోపాలు సరిచేసి ఆర్‌వోఆర్ చట్టం 2024 తెస్తున్నామని చెప్పారు. కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. పదేళ్లలో కేసీఆర్ కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనపడటం లేదన్నారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గనికి 3500 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు.పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయని పనులను ఒక సంవత్సరం కాలంలోనే రేవంత్ ప్రభుత్వం చేసి చూపెట్టిందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి యూట్యూబ్ చానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికీ కొన్ని అమలు చేశామని.. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..
Minister Seethakka: బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి.. మంత్రి సీతక్క భావోద్వేగం
For Telangana News And Telugu News
Updated Date - Dec 08 , 2024 | 06:25 PM