Share News

TG highcourt: కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:55 AM

Telangana: మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్‌, హరీష్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ జరిపింది.

TG highcourt: కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట
KCR And Harish Rao

హైదరాబాద్, డిసెంబర్ 24: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Minister Harish Rao) తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురవడంపై దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. అలాగే ఫిర్యాదుదారుడికి కోర్టు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల (జనవరి) 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..


కాగా.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన భూపాల్లి కోర్టు.. కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జూలై 10న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్‌ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది.

డెడ్ బాడీ పార్శిల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు


అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్‌, హరీష్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ జరిపింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు

పోలీస్ స్టేషన్‌కు పుష్ప

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 12:48 PM