Congress MLA'S: కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. బీఆర్ఎస్‌పై తెల్లం, కాలే యాదయ్య ఫైర్

ABN, Publish Date - Jul 30 , 2024 | 09:26 PM

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

Congress MLA'S: కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. బీఆర్ఎస్‌పై తెల్లం, కాలే యాదయ్య ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఫేక్ ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తెల్లం వెంకట్రావ్ చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్‌లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారని విమర్శించారు. తన ఫొటో తీసి పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రుల చాంబర్‌లకు వచ్చి కలుస్తున్నారు.. వారంతా పార్టీ మారేవారేనా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోనే తన ప్రయాణమని తెల్లం వెంకట్రావ్ తేల్చిచెప్పేశారు.


కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: కాలే యాదయ్య

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య (Kale Yadaiah) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. తెల్లం వెంకట్రావ్ ఫొటోను బీఆర్ఎస్ నేతలు కావాలనే తీసి వైరల్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారం తనకు ఉందని కాలే యాదయ్య తెలిపారు.


అది ఫేక్ ప్రచారమే: మంత్రి పొంగులేటి

మరోవైపు.. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత పరిచయం కాబట్టి కలసి ఉంటారని అన్నారు. తమ దగ్గరకి వచ్చిన నేతలు ఎవరు ఇబ్బంది కలగకుండా ఉంటారని చెప్పారు. తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఎవరు ఎక్కడికి పోరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

TS News: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2024 | 09:38 PM

Advertising
Advertising
<