Hyderabad: షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌కు 24 గంటలపాటు వాటర్ బంద్..
ABN, Publish Date - Nov 09 , 2024 | 09:52 PM
హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పైపులకు భారీ లీకేజీల కారణంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది.
హైదరాబాద్: నగరంలో నవంబర్ 11, 12 తేదీల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది. నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పైపులకు భారీ లీకేజీల కారణంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఓ ప్రకటలో తెలిపింది. దాదాపు 24 గంటలపాటు మంచినీరు అందుబాటులో ఉండదని, ఈ విషయాన్ని నగరవాసులు గమనించాలని కోరింది.
మంజీరా ఫేజ్-2లో మరమ్మతుల దృష్ట్యా ఆర్.సి.పురం, అశోక్‌నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కెపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపింది. కాబట్టి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు స్థానికులు సహకరించాలని కోరింది. అలాగే నీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
KTR: మిత్తీతో సహా చెల్లిస్తాం.. కేటీఆర్ వార్నింగ్
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 09 , 2024 | 09:56 PM