MLC Kavitha: కవిత కేసులో ముగిసిన వాదనలు.. క్షణ క్షణం ఉత్కంఠ..
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:29 PM
ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. కాగా.. కవిత కేసులో ఇరువైపుల వాదనలు ముగిశాయియి.
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. కాగా.. కవిత కేసులో ఇరువైపుల వాదనలు ముగిశాయియి. కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 16 వ తేదీ వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు.
MLC Kavitha: కడిగిన ముత్యం లా బయటకు వస్తా..
ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ... అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్‌ని తమకు కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్స్ అన్నీ ప్రిజర్వ్ చేయాలని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోరారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని విక్రమ్ చౌదరి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు అయితే ముగివాయి. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు. కవిత కేసు నేడు ఏమవుతుందోనని క్షణ క్షణం ఉత్కంఠ నడుస్తోంది.
Big Breaking: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం
కాగా.. ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో ఆమె మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత తెలిపారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీలో జాయిన్ అయ్యారు. మరొకరు టికెట్ ఆశిస్తున్నారు. థర్డ్ ముద్దాయి ఎలక్ట్రోల్ రూపంలో రూ.. 50 కోట్లు ఇచ్చారన్నారు. ఇది ఫ్యాబ్రికేటేడ్, ఫాల్స్ కేసు అని కవిత వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 12:30 PM