Hyderabad: మేయర్ ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్సీ..
ABN, Publish Date - Nov 24 , 2024 | 02:52 PM
పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.
హైదరాబాద్: పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు. సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను మజ్లిస్ ఎమ్మెల్సీ బేగ్ బెదిరించారంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సీజ్ చేసిన 24 గంటల్లోనే కోఠి, మోతి మార్కెట్‌లోని చికెన్, మటన్ షాపులను వ్యాపారులు తెరిచారు. రెండ్రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో చికెన్‌ను తింటున్న ఎలుకలను చూసి మేయర్ అవాక్కయ్యారు. పలు చికెన్ షాపుల్లో చనిపోయిన కోళ్లను సైతం అమ్ముతున్నట్లు గుర్తించిన మేయర్.. షాపుల యజమానులపై సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం
కుళ్లిన చికెన్ అమ్ముతున్న వారిపై చర్యల తీసుకోవాలని ఫుట్ సేఫ్టీ అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో అధికారులు పలు దుకాణాలను మూసివేశారు. అయితే మూసివేసిన 24 గంటల్లోనే షాపుల వ్యాపారులు దుకాణాలను తిరిగి తెరిచారు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పెనాల్టీలు సైతం వ్యాపారులు చెల్లించలేదు. మేయర్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో చికెన్, మటన్ షాపులను యథేచ్ఛగా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. అయితే అధికారులపై ఎమ్మెల్సే బేగ్ బెదిరింపులకు దిగడంతోనే వ్యాపారులు తమ దుకాణాలు తెరిచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధారాలతో అడ్డంగా బుక్కైన జగన్..
Updated Date - Nov 24 , 2024 | 05:05 PM