ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donatekart: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:35 PM

Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్‌ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..

Donatekart

Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్‌ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా.. తీవ్ర బాధాకరమైన క్షణాలతో గడుపుతున్నారు. క్షణ క్షణం భయం భయంతో జీవిస్తున్నారు. చాలా కాలం ఎదురుచూపుల త్వరగా జన్మించిన వారి అమ్మాయి.. NICUలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. చిన్నారి తమకు ఎక్కడ దూరమవుతుందోనని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి...


దుర్గ గర్భం దాల్చడం అంత సులభం కాదు..

గర్భవతి అయిన దుర్గ.. అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యింది. ఆమె ఏడో నెలలో ఉండగా ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. కాలెయంలో వాపు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సమస్యలు ఆమె చుట్టుముట్టాయి. అత్యవసరంగా ప్రసవం చేయడం మినహా వైద్యులకు మరో మార్గం లేకుండా పోయింది. దుర్గ ప్రసవించింది. శిశువు చాలా తక్కువ బరువుతో జన్మించింది. పుట్టిన ఆడ శిశువు తనంతట తానుగా ఊపిరి పీల్చుకోలేకపోతుంది. శిశువు అకాల జననం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. పసిగుడ్డును బతికించేందుకు NICUలో కనీసం 50 రోజుల ప్రత్యేక సంరక్షణ అవసరం.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


“పాప పుట్టినప్పుడు మేము ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తులం. మా ప్రార్థనలకు ఫలితం దొరికిందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతిరోజూ పరీక్షలా గడుస్తోంది. మేము మా బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము” అని బాల మహేష్ కన్నీరుమున్నీరయ్యాడు.

గత కొన్ని వారాలుగా తల్లిదండ్రులు తమ బిడ్డపై ఆశలు పెట్టుకుని ఆస్పత్రిలోని వెయిటింగ్ రూంలోనే ఉంటున్నారు. వారు ప్రతిరోజూ తమ కుమార్తెను సందర్శన వేళల్లో NICU గాజు అద్దంలోంచి చూస్తున్నారు. మరీ కష్టమైన విషయం ఏంటంటే.. ఆ చిన్నారిని తల్లిదండ్రులు తమ చేతులతో పట్టుకునే అవకాశం కూడా లేదు. వైద్యులు అందుకు అంగీకరించని పరిస్థితి ఉంది.

‘‘నేను ఆమెను ఒక్కసారైనా ఎత్తుకోవాలనుకుంటున్నాను. అవసరమైనప్పుడు బిడ్డను ఓదార్చలేకపోవడం మాకు శిక్షలా అనిపిస్తుంది” అని కనకదుర్గ కన్నీరు పెట్టుకున్నారు.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


బాల మహేష్ విజయవాడలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు కేవలం 10,000 రూపాయలు సంపాదించేశాడు. అలా ఆ కుటుంబం తమ పొదుపులోని ప్రతి రూపాయిని తమ బిడ్డను రక్షించుకునేందుకు ఖర్చు చేసింది. ఆ డబ్బులు కూడా సరిపోకపోవడంతో స్నేహితులు, బంధువుల నుండి అప్పుగా తీసుకుని ఇప్పటివరకు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేశారు. కానీ ఇంకా డబ్బు అవసరం ఉంది. ఆ డబ్బు కోసం ఈ దంపతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. శిశువును NICUలో ఉంచడానికి రూ. 14,00,000 ఖర్చు అవుతుంది. ఈ మొత్తం వారు భరించగలిగే దానికంటే చాలా ఎక్కువ.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


మీరు ఎలా సహాయం చేయవచ్చు..

‘‘మేము చేయగలిగినదంతా చేశాము. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కొన్ని రోజులుగా భోజనం కూడా చేయలేదు. మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా కాలం తరువాత పుట్టిన బిడ్డ. ఈ పరిస్థితిలో తనను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మా బిడ్డను కాపాడేందుకు మాకు సహాయం చేయండి.’’ అని శిశువు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


శిశువు తల్లిదండ్రులు దేవుడిని ప్రార్థిస్తూ.. గుండెలనిండా బాధతో తమకు దాతలు ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నారు. దాతల సహాయంతో తమ చిన్నారి ఆరోగ్యంగా తమ ఇంటికి వస్తుందనే ఆశతో వారు జీవిస్తున్నారు. మీ సహకారం ఒక జీవితాన్ని నిలబెడుతుంది. దయచేసి ఈ కుటుంబానికి తమ ఆడబిడ్డను కాపాడేందుకు సహాయం చేయండి.

ఇక్కడ సాయం చేయండి..

దాతలు సాయం చేసేందుకు కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి.. మీకు తోచిన మొత్తంలో బాధిత వ్యక్తులకు డబ్బు పంపవచ్చు.

చిన్నారికి సాయం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2024 | 01:58 PM