ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tollywood: రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 08:45 PM

Tollywood: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోపాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు.

Tollywood film celebrities Meeting With CM Revanth Reddy tomorrow in Hyderabad

హైదరాబాద్‌, డిసెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యేందుకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. గురువారం ఉదయం 10.00 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోపాటు పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా తదితరులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమల సమస్యలే ఎజెండాపైనే చర్చ జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ నేపథ్యంలో రేపటి భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 04వ తేదీ రాత్రి ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీ రిలీజ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని అభిమానులతో వీక్షించేందుకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.


మరోవైపు ఈ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ మంజూరు అయింది. దీంతో అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో సైతం ఈ వ్యవహరంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ స్పందించారు.

Also Read: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

Also Read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ


ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లతోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు సైతం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకోవైపు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారు పరామర్శిస్తున్నారు.

Also Read: నితీష్, నవీన్‌లకు భారతరత్న ఇవ్వాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Also Read: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ


అలాగే శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును దిల్ రాజుకు ఆయన అందజేశారు. ఈ తరహా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

For Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 09:08 PM