ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

ABN, Publish Date - Apr 25 , 2024 | 02:01 PM

TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..

IPL Matches

IPL 2024: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా గురువారం నాడు ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో(Uppal Cricket Stadium) హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. మెట్రో, ఆర్టీసీ సేవలు నడిపే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.


ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్ల మధ్య ఇవాళ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు. స్టేడియం బయటి నుంచి వీక్షించే వారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం మార్గంలో నడిచే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. అలాగే ఆర్టీసీ బస్సులు నడిచే సమయాన్ని కూడా పొడిగించారు. సాధారణంగా అయితే రాత్రి 11 గంటలకు చివరి మెట్రో ఉంటుంది. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ రన్నింగ్ టైమ్స్ ఛేంజ్ చేశారు.


మారిన సమయం ప్రకారం.. మెట్రో రైళ్లు ఇవాళ అర్థరాత్రి 1.10 గంటల వరకు నడవనున్నాయి. అయితే, చివరగా రైళ్లు 12.15 గంటలకు బయలుదేరనుండగా.. 1.10 గంటలకు అవి గమ్య స్థానాలకు చేరుకుంటాయి. అయితే, ఈ సయంలో ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. అంతేకాదు.. ఈ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అవకాశం ఉంటుంది. ట్రైన్ ఎక్కడానికి అవకాశం లేదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.


ఇక ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

For More Telangana News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 02:10 PM

Advertising
Advertising