Minister Uttam: రైతు రుణమాఫీ కాని వారందరికీ త్వరలోనే చేస్తాం..
ABN, Publish Date - Aug 19 , 2024 | 05:53 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు.
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారాలు నమ్మెుద్దు..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. " కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతలను ఏనాడూ పట్టించుకోలేదు. పకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతన్నలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరోజూ ఆదుకోలేదు. రుణమాఫీ చేతగాని గత ప్రభుత్వం మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఇంత వేగంగా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే. కొన్ని కారణాల వల్ల కొంతమందికి మాఫీ జగలేదన్నది వాస్తవం. వారి సమస్య త్వరలోనే పరిష్కరించి నగదు అందజేస్తాం. మాఫీ కాని రైతులను బీఆర్ఎస్, బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. వారిని ఉద్దేశపూర్వకంగా రెడ్లపైకి తెస్తున్నారు. ప్రతిపక్షాల మాటలను రైతులు వినొద్దు. త్వరలోనే మీకు పూర్తి రుణ మాఫీ చేస్తాం.
అందుకే మాఫీ అవ్వలేదు..
రెండుసార్లు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి, రెండో దశలో చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకే సరిపోయింది. అలాంటి నేతలు ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. ఏ కారణం చేతనైనా రుణమాఫీ కాకపోతే త్వరలోనే అవుతుంది. రైతులు కంగారు పడాల్సిన పనిలేదు. లక్షా 20వేల ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల ఆ రైతులకు రుణమాఫీ ఆగింది. అలాగే లక్షా 61వేల అకౌంట్లకు ఆధార్, పాస్ బుక్ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. లక్షా 50వేల ఖాతాల్లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి. 4లక్షల 83వేల అకౌంట్లకు రేషన్ కార్డు వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. మరో 8లక్షల అకౌంట్లకు రూ.2లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి. వీటంన్నింటిని పరిష్కరిస్తాం. రూ.2లక్షలపైన రుణాలు ఉన్న రైతులు పైమొత్తం చెల్లించిన తర్వాత వారికి రుణమాఫీ అవుతుంది. సమస్యల పరిష్కారానికి అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్హత ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ జరుగుతుంది" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rakhi Festival: మానవాతా దృక్పథాన్ని చాటుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి
KTR: మంత్రి సీతక్కకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
Updated Date - Aug 19 , 2024 | 07:54 PM