HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన
ABN, Publish Date - Nov 28 , 2024 | 07:21 AM
చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) పరిశీలించారు.
- గ్రేటర్‌తోపాటు శివార్లలోని చెరువుల సందర్శన
- ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు
- షెడ్ల తొలగింపునకు కమిషనర్ రంగనాథ్ ఆదేశం
హైదరాబాద్ సిటీ: చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) పరిశీలించారు. నివాసేతర ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, వెంటనే తొలగించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కామెంట్ తెచ్చిన చేటు.. మద్యం మత్తులో అసభ్యకర వ్యాఖ్యలు
శేరిలింగంపల్లి మాదాపూర్‌లోని ఖానామెట్ సర్వే నంబర్ 7లో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈదులకుంటను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మట్టితో పూడుస్తుందన్న ఫిర్యాదుతో అక్కడకు వెళ్లిన రంగనాథ్.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఈదులకుంటను పరిశీలిస్తానని, నిర్మాణదారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, సర్వే నివేదికను పరిశీలిస్తానన్నారు. మాదాపూర్‌లోని మేడికుంటను కూడా ఆయన పరిశీలించారు. మెజార్టీ కుంట మాయమై ఇప్పటికే అక్కడ బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.
ఇకపై చెరువులు కబ్జా కాకుండా నియంత్రిస్తాం
నిజాంపేట్‌లోని తలాబ్ (తురక లేక్) చెరువు ఆక్రమణల వివరాలను స్థానికులు కమిషనర్ రంగనాథ్‌కు వివరించారు. చెరువుకు సంబంధించిన మ్యాపులు, డాక్యుమెంట్లను ఆయన పరిశీలించారు. ఇదే చెరువు వద్ద నిజాంత ల్యాబ్‌ను కూడా పరిశీలించారు. కట్టకు ఆనుకుని ఉన్న షెడ్లను రెండు రోజుల్లో తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కట్టపైకి వెళ్లిన కమిషనర్ చెరువులోకి ఇన్‌లెట్ ద్వారా వస్తోన్న మురుగునీటిని చూసి చెరువంతా కలుషితమవుతుందని, మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో చెరువుకు సంబంధించి సమగ్ర సర్వే చేయాలన్నారు. బండారి లే అవుట్ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు చెరువును పూర్తిస్థాయిలో పరిశీలించారు. నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చిన్న చెరువును పరిశీలించిన ఆయన బఫర్ జోన్‌లో నిర్మాణాల వివరాలు తెలుసుకున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలోని మురుగునీరు నేరుగా వచ్చి చెరువులో చేరుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. తెల్లాపూర్‌లోని వనం, చెల్లికుంట, మేళ్ల చెరువులను ఆయన పరిశీలించారు. సుందరీకరణ పేరిట రియల్ కంపెనీలు కబ్జా చేస్తున్నాయని, చెరువులను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ఇక నుంచి చెరువులు కబ్జా కాకుండా నియంత్రిస్తామని, పునరుద్ధరణకూ అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, డాక్యుమెంట్లు, సర్వే నివేదికలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలుంటాయని స్థానికులతో కమిషనర్ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2024 | 07:21 AM