ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shamshabad: మెడపై కత్తి పెట్టి.. కారు అపహరణ..

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:29 AM

ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్‌ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఆవరణలో ఘటన

  • గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు

  • పాత నేరస్థులుగా గుర్తింపు..

రిమాండ్‌కు తరలింపు

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్‌ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ రాజు తన యజమానిని కారులో విమానాశ్రయంలో దింపాడు. తిరిగి రాజు ఇంటికెళ్లే సమయంలో అక్కడే తిష్ట వేసిన నజీముల్లా, ఎండీ అబ్దుల్‌ ఖదీర్‌ ప్రయాణికుల్లా కారును ఆపారు. కారు ఆగగానే రాజు మెడపై కత్తి పెట్టి కిందికి దిగకపోతే చంపుతామని వారు బెదిరించారు.


దాంతో భయపడిన రాజు కారు దిగగా.. నజీముల్లా, ఖదీర్‌లు కారుతో ఉడాయించారు. దీంతో రాజు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా కారు ఏ మార్గంలో వెళ్లిందో గుర్తించారు. బెంగళూరు హైవేపై గగన్‌పహడ్‌ వద్ద కారును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఇద్దరు నిందితులు.. పాత నేరస్థులేనని, వారిపై రెండు హత్యలతో పాటు పలు కేసులున్నాయని ఏసీపీ శ్రీనివాస్‌ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.

Updated Date - Jun 27 , 2024 | 03:29 AM

Advertising
Advertising