ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagga Reddy: ముందుచూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్‌

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:10 AM

ముందు చూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఈ మేరకు బడ్జెట్‌ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.

  • బడ్జెట్‌ను చూసి కేసీఆర్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది

  • పదేళ్లలో మీరిచ్చిన నిధులెన్ని?

  • విజన్‌తో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ముందు చూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఈ మేరకు బడ్జెట్‌ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు. అసలు అధికారంలో ఉన్న పదేళ్లలో ఇట్లాంటి ఆలోచనే కేసీఆర్‌ చేయలేదని పేర్కొన్నారు. రేవంత్‌ పెట్టిన బడ్జెట్‌ను చూసి కేసీఆర్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజల అభివృద్ధి బడ్జెట్‌ను పెట్టిందని కొనియాడారు.


వాస్తవానికి హైదరాబాద్‌ అభివృద్ధికి ఈ మేరకు నిధులు కేటాయించినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలకు అభినందనలు తెలపాలన్నారు. ‘‘పిట్టకథలు చెప్పడంలో కేసీఆర్‌ దిట్ట! హుసేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్ల లెక్కన చేస్తనన్నడు. పదేళ్లు గడిచినా ఎందుకు చేయలేదు?’’ అంటూ నిలదీశారు. హైదరాబాద్‌ పాత నగరంలో మౌలిక సదుపాయాలు లేవని, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ వంటి చోట్లా వర్షం వస్తే నీట మునిగే కాలనీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. జీహెచ్‌ఎంసీకి రూ. 3065 కోట్లు, హెచ్‌ఎండీఏకి రూ.500 కోట్లు, హైడ్రాకి రూ.200 కోట్లు, పాతనగరంలో మెట్రో కోసం రూ.500 కోట్లు బడ్జెట్లో కేటాయించారని వివరించారు. కేసీఆర్‌కు విజన్‌ ఉంటే పదేళ్లలో హైదరాబాద్‌కు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజన్‌ ఉంది కాబట్టే హైదరాబాద్‌ నగరానికి రూ.10 వేల కోట్లు కేటాయించిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి చేస్తే శభాష్‌ అంటూ మెచ్చుకునే ధైర్యం తమకు ఉందని, కానీ మంచి పని చేస్తే మెచ్చుకునే పెద్ద మనసు కేసీఆర్‌కు లేదని జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 03:10 AM

Advertising
Advertising
<