Jupalli Krishna Rao: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదు: జూపల్లి
ABN, Publish Date - Jul 08 , 2024 | 04:53 AM
శాసనసభలో పూర్తి మెజార్టీ ఉండి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్న కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ నేతలకు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
హైదరాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): శాసనసభలో పూర్తి మెజార్టీ ఉండి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్న కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ నేతలకు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నైతిక విలువలే ఉంటే ఆనాడు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకుని ఉండేవారు కాదని పేర్కొన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆదివారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బి.శంకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీతో కలిసి కూల్చే ప్రయత్నం కేసీఆర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్ నేతలు పలు మార్లు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం వల్లనే ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరుతున్నారన్నారు.
ఫిరాయింపులపైన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. రాహుల్‌గాంధీకి బదులుగా కేసీఆర్‌కు లేఖ రాసుండాల్సిందని జూపల్లి సూచించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విలువల గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇన్నాళ్లుగా కేసీఆర్ పక్కనే ఉన్నవు కదా? ఈ పదేళ్లలో ఇతర పార్టీలకు చెందిన 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నప్పుడు గాడిదలు కాశావా?’’ అంటూ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాసాలనకు ఆకర్శితులయ్యే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపైన నిరంజన్ రెడన్డి మళ్లీ నోరు పారేసుకుంటే వనపర్తి గల్లీలో కూడా తిరగనివ్వబోమని హెచ్చరించారు.
Updated Date - Jul 08 , 2024 | 04:53 AM