ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaushik Reddy: రా తేల్చుకుందాం.. మంత్రి ప్రభాకర్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ABN, Publish Date - Jun 23 , 2024 | 03:28 PM

అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు.

Padi Kaushik Reddy

హుజురాబాద్: అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు. మీ లీగల్ నోటీసులకు మా లీగల్ టీమ్ లీగల్‌గా సమాధానం చెప్తుంది. ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డబ్బులు తీసుకోకపోతే బుధవారం టీటీడీ వెంకటేశ్వరస్వామి టెంపుల్‌లో ప్రమాణానికి సిద్ధమా...? బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని నిజాలు బయటపెడతాము’’ అని సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెబుతున్నారని ఆరోపించారు.


రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ల పెంపు గురించి మర్చిపోయారన్నారు. మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి ఆపారని చెప్పారు. వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. తాము ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కళ్యాణలక్ష్మి చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే హై కోర్టుకు వెళ్తానని తెలిపారు.

Updated Date - Jun 23 , 2024 | 03:28 PM

Advertising
Advertising