ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: బీఆర్‌ఎస్‌ ఓటమితో మహారాష్ట్ర ప్రజల్లో ఆవేదన..

ABN, Publish Date - Jul 05 , 2024 | 04:04 AM

దేశంలో రైతురాజ్యాన్ని తెచ్చుకోవాలని ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదాన్ని ఎత్తుకున్న బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందారని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.

  • రాష్ట్ర ప్రజల నిర్ణయం దేశ రైతాంగాన్ని నిరుత్సాహపర్చింది

  • బాధపడొద్దు.. రాబోయేది మన ప్రభుత్వమే: కేసీఆర్‌

హైదరాబాద్‌/మర్కుక్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో రైతురాజ్యాన్ని తెచ్చుకోవాలని ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదాన్ని ఎత్తుకున్న బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందారని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణతోపాటు దేశ రైతుల ప్రగతి కోసం బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడి ఓటమి దేశవ్యాప్తంగా రైతులను నిరుత్సాహపర్చిందని పేర్కొన్నారు. ‘మీ (కేసీఆర్‌) పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే.. దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయింది’ అని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని కేసీఆర్‌ చెప్పారు. రైతు రాజ్యాన్ని అందించగలిగిన దమ్మున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారన్నారు.


గురువారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్‌ మాట్లాడారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదన్నారు. అధికారం కోల్పోయామని బాధపడడం రాజకీయ నాయకుడి లక్షణం కాదని చెప్పారు. అలాగే ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని, భవిష్యత్తులో అధికారం మనదేనని పార్టీ శ్రేణులకు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరె డ్డి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 04:04 AM

Advertising
Advertising