Cybercrime: ఇద్దరు నిందితులు.. 23 సైబర్ నేరాలు..
ABN, Publish Date - Aug 09 , 2024 | 04:02 AM
తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు చిక్కారు.
రాజస్థాన్‌లో అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు చిక్కారు. రాజస్థాన్‌కు చెందిన నంద కిషోర్, దీపక్ వైష్ణవ్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అక్కడికెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నంద కిషోర్ గత ఏప్రిల్‌లో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో సల్సార్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసి సంస్థ పేరుతో ఎస్‌ఆర్ నగర్‌లోని బంధన్ బ్యాంకులో ఖాతా తెరిచి సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నాడు.
అయితే కరీంనగర్‌కు చెందిన సత్తయ్యను స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట వాట్సాప్ మెసేజ్‌లతో ఆకర్షించి గత మేలో పలు దఫాల్లో రూ.46.11 లక్షలు వసూలు చేశాడు. బాధితుడు కరీంనగర్ సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో మొత్తం 23 నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Updated Date - Aug 09 , 2024 | 04:02 AM