ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

ABN, Publish Date - May 17 , 2024 | 01:17 PM

Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.

BRS MLC Candidate Rakesh Reddy

ఖమ్మం జిల్లా, మే 17: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి (Graduate MLC BRS Candidate Anumula Rakesh Reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు (BRS Chief KCR) అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి (Congress) అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలి అంటే ప్రశ్నించే వ్యక్తిని చట్ట సభల్లో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా?.... ప్రశ్నించలేని వ్యక్తి కావాలా? అని అన్నారు.

Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారని.. మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అడిగారు. ఇప్పటిదాక నిరుద్యోగ భృతి విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్ అమలు కావాలి అంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో గెలుస్తానన్నారు. ‘‘బీఆర్ఎస్ అభ్యర్ధిగా నేను ప్రశ్నించే గొంతును... మా ప్రశ్న ప్రజల కోసం... ప్రజా సమస్యల కోసం మాత్రమే.. దందా కోసం, డబ్బు కోసం, వ్యూస్ కోసం కాదు’’ అని స్పష్టం చేశారు. ఐదవ సారి గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దలు పట్టభద్రులు ఈనెల 27 న జరిగే ఎన్నికలో 3 నెంబర్‌పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి....

PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 01:19 PM

Advertising
Advertising