ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Thummala: అక్రమ నిర్మాణాలపై చర్యలు.. మంత్రి తుమ్మల షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Sep 24 , 2024 | 06:48 PM

ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.

Minister Thummala Nageswara Rao

ఖమ్మం: ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు. ఇవాళ(మంగళవారం) కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... తాగునీరు విద్యుత్ పునరుద్ధరణ సకాలంలో పూర్తి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


ALSO READ: KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి మున్నేరు వరదల వల్ల మొత్తం 24 స్పాన్స్‌లో తొమ్మిది స్పాన్‌లు పక్కకు జరిగాయని అన్నారు. ఒక్కో స్పాన్ యథాతథ స్థితిలో బేరింగ్‌లు మార్చి పెట్టాలంటే పది రోజులు సమయం పడుతుందని చెప్పారు. బిల్డ్ కాన్ కంపెనీ నిర్వాహకులు బ్రిడ్జి మరమ్మతు పనులు చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడు నెలల్లో బ్రిడ్జిని యథాతథ స్థితికి తెస్తామని వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మున్నేరు పాత చఫ్టాపై రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. రిటైనింగ్ వాల్ రీ డిజైన్‌పై అనుభవం ఉన్న కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


ALSO READ: Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు

నిపుణుల నివేదిక ఆధారంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వందేళ్లకు విపత్తుల వల్ల ఇబ్బందులు లేకుండా మున్నేరు రిటైనింగ్ వాల్...డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మున్నేరుకు వరద తగ్గగానే పది రోజుల్లో ప్రకాశ్‌నగర్ వద్ద కాజ్‌వేపై రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారుల వల్ల రింగు రోడ్డు ఏర్పాటుకు మార్గం సుగమైందని చెప్పారు. జాతీయ రహదారుల రింగు రోడ్డు వల్ల ఖమ్మంలో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఉండబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


ఖమ్మం టూ సూర్యాపేట... ఖమ్మం టూ కోదాడ జాతీయ రహదారి పూర్తి అయిందని అన్నారు. ఖమ్మం టూ కురవి జాతీయ రహదారి పనులు వచ్చే ఉగాది నాటికి పూర్తి అవుతాయని వివరించారు. ఆయిల్ ఫాం పై ఇంపోర్ట్ టాక్స్ పెంచడం వల్ల పామాయిల్ రైతులకు అదనపు లాభాలు వస్తాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి మనస్సుతో పామాయిల్ రైతులకు మేలు చేశారని తెలిపారు. కరవు కాటకాలు విపత్తుల వల్ల ఆయిల్ ఫాంకు ఎలాంటి నష్టం రాదని చెప్పారు. తెలంగాణ రైతాంగం ఆయిల్ ఫాం సాగుబాట పట్టాలని సూచించారు. వరదల వల్ల రైతు రుణమాఫీ కుటుంబ నిర్దారణ ఆలస్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన డేటా వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆఖరి రైతు వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 24 , 2024 | 07:07 PM