ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ABN, Publish Date - Nov 29 , 2024 | 04:01 AM

గురివింద చందంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తీరు ఉందని.. ఆ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం.. ఒకరు గిల్లితే.. మరొకరు ఏడ్చినట్లుందని ఎద్దేవా

  • బీఆర్‌ఎస్‌ మాదిరిగా బీజేపీ డ్రామాలు చేయదు, అబద్ధాలు చెప్పదు

  • ‘కారు’ షెడ్డులో ఉన్నా.. దాని తాళాలు ‘చేతి’లోనే: బండి సంజయ్‌

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గురివింద చందంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తీరు ఉందని.. ఆ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రె్‌సలోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని మంత్రిపదవులు తీసుకున్నారని.. అప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లు? అనే విషయాన్ని కేసీఆర్‌ చెప్పగలరా? అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెరచాటు ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని.. బయటకు మాత్రం మేం గిల్లినట్లు చేస్తాం.. మీరు ఏడ్చినట్లు చేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ మోసపూరిత విధానాలను అనుసరించిందని, వాటినే ఏడాదిగా కాంగ్రెస్‌ పాటిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి కుంభకోణాలు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడమే ఎవరితో ఎవరు కలిసున్నారనేది చెబుతోంది? రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య గొడవలు పెట్టి రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో, అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యత ఉందని ఆరోపించారు.


ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే.. ఎవరు డ్యాన్స్‌ చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమైపోయిందని పేర్కొన్నారు. కాగా బీఆర్‌ఎస్‌ పార్టీ మాదిరిగా బీజేపీ డ్రామాలు చేయదని, అబద్ధాలు చెప్పదంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ ఎప్పటికీ కలువబోవని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ట్విట్టర్‌ టిల్లుకు లేకుండాపోయింది’ అని ఎద్దేవా చేశారు. ‘కారు’ షెడ్డులో ఉన్నా, దాని తాళాలు ఎవరి ‘చేతి’లో ఉన్నాయో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు మందగించడం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రహస్య ఒప్పందంలో భాగమేనని ఆరోపించారు. ధరణి, గొర్రెల పంపిణీ, కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోలు కుంభకోణాలు సహా ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌, జన్వాడ ఫాంహౌజ్‌ కేసులపై దర్యాప్తు ఎందుకు నిలిచిపోయిందో అందరికీ అర్థమైపోయిందని సంజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 04:01 AM