ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఏడాదైనా ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:28 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

  • ఆ పార్టీ మోసాలను ప్రజలకు చెప్పేందుకు త్వరలో హైదరాబాద్‌లో సభ: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాలంగా అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఆరు హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు.


వంద, రెండోందల రోజలు ఎప్పుడో గడిచిపోయాయని మరో రెండు రోజుల్లో 365 రోజులు కూడా పూర్తి కానున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పరిస్థితి గురివింద గింజ సామెతలా ఉందని అన్నారు. ఆ పార్టీకి హామీలను జ్ఞాపకం చేయడానికి తమ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ఎలా మోసం చేసిందో ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తామని కిషన్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - Dec 06 , 2024 | 03:28 AM