ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఆర్థికవృద్ధిలో గనుల పాత్ర కీలకం..

ABN, Publish Date - Aug 08 , 2024 | 03:49 AM

దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి.. మైనింగ్‌ సంస్థలకు 5 స్టార్‌ రేటింగ్‌ ప్రదానం

  • తెలంగాణలో 5, ఏపీలో 5 గనులకు అందజేత

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మైనింగ్‌ పరిశ్రమ ఒకటని అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్‌ చేస్తున్న 68 సంస్థలకు కేంద్ర మంత్రి 5 స్టార్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. మైనింగ్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ ఆధ్వర్యలో హైదరాబాద్‌లో ఓ వర్క్‌ షాప్‌ నిర్వహించారని గుర్తు చేశారు.


ఆ కార్యక్రమంలో మైనింగ్‌ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామని చెప్పారు. క్రిటికల్‌ మినరల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, కేంద్రం నుంచి 5 స్టార్‌ అవార్డులు పొందిన జాబితాలో తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5 మైనింగ్‌ సంస్థలు ఉన్నాయి. ఏపీ నుంచి భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌(కడప), జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌(నంద్యాల), దాల్మియా సిమెంట్స్‌ నవాబ్‌పేట(తలమంచిపట్నం), అలా్ట్రటెక్‌(తుమ్మలపెంట), శ్రీ జయజ్యోతి(మైహోం) సిమెంట్స్‌ (కర్నూల్‌)ఉన్నాయి. తెలంగాణ నుంచి మైహోం(చౌటుపల్లి-1), టీఎ్‌సఎండీసీ దేవాపూర్‌ (మంచిర్యాల), మైహోం (మేళ్ల చెరువు), రైన్‌ సిమెంట్స్‌(నల్లగొండ), సాగర్‌ సిమెంట్స్‌(నల్లగొండ)ఉన్నాయి.


  • రాష్ట్రానికి 48 వేల కోట్ల లబ్ధి: రఘునందన్‌

తెలంగాణకు డైరెక్ట్‌ ఫండ్‌ కింద కేంద్రం నుంచి రూ.48 వేల కోట్లు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఎన్ని నిధులిచ్చినా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదన్నారు. అవి తమ పథకాలుగా ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. గతంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లని చెబుతున్నారని.. వాటికి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.


  • ప్రధానిని కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు

ప్రధాని మోదీని బుధవారం లోక్‌సభలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, గొడం నగేశ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. తెలంగాణకు మరింత ఆర్థిక చేయూతనివ్వాలని మోదీని కోరారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఎంపీలకు మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అన్ని వేళలా తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మోదీని రఘునందన్‌రావు నూలు పోగుల దండతో సత్కరించారు.

Updated Date - Aug 08 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<