Share News

Kishan Reddy: కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదు.. కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి?

ABN , Publish Date - Mar 23 , 2024 | 05:18 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) ఓ సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. కూతురు కవిత అరెస్ట్‌పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy: కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదు.. కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) ఓ సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. కూతురు కవిత అరెస్ట్‌పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Policy) మార్పులో కవిత ప్రమేయముందని ఈడీ చెప్తోందని, అందుకే ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. కవిత అరెస్ట్‌తో బీజేపీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.


లిక్కర్ పాలసీని మార్చినందుకు ఆప్ ఆద్మీ పార్టీకి (Aam Admi Party) నిధులు సమకూరాయని చెప్పిన కిషన్ రెడ్డి.. కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ అవాస్తవాలను ఖండించారు. అవినీతి చేసిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే.. బ్లాక్ డే ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇందుకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అడిగారు. కుటుంబ రాజకీయాలు, వారసులు ప్రజాప్రతినిధులు అవటం కూడా బ్లాక్ డేనేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నట్లు.. కేసీఆర్ కుటుంబం (KCR Family) ఢిల్లీలో కూడా దోచుకుందని సంచలన ఆరోపణలు గుప్పించారు. కవిత అరెస్ట్‌తో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని.. ఆమె అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎలాంటి మార్పు రాదని తేల్చి చెప్పారు.

తెలంగాణలో లిక్కర్ అమ్మకాలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) టాక్స్ వేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో తీగ లాగితే ఢిల్లీలో డొంక కదులుతోందని.. తెలంగాణ లిక్కర్ పాలసీలనే ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా సికింద్రాబాద్ పార్లమెంట్‌లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన దృష్టి ప్రచారంపైనే ఉందని, అభ్యర్థి ఎవరైనా తనకు భయం లేదని అన్నారు. సికింద్రాబాద్ సహా.. అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. బీఆర్ఎస్ అవసరం తెలంగాణకు లేదని.. తమకు (బీజేపీ) కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 05:18 PM