ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఖనిజాన్వేషణలో ప్రైవేటుకు పెద్దపీట

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:03 AM

ఖనిజాల అన్వేషణ(ఎక్స్‌ప్లోరేషన్‌)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌) గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది.

  • స్టార్ట్‌పలు, సాంకేతికతను ప్రోత్సహిస్తాం

  • 6వ ఎన్‌ఎమ్‌ఈటీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఖనిజాల అన్వేషణ(ఎక్స్‌ప్లోరేషన్‌)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌) గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది. ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌ హోదాలో ఈ సమావేశానికి హాజరైన కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఖనిజ సంపదకు లోటు లేదని, కానీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేక పోతున్నామని తెలిపారు.


అందుకే 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌ఎమ్‌ఈటీని స్థాపించారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఖనిజాల ఎక్స్‌ప్లోరేషన్‌లో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్ట్‌పలను ప్రోత్సహించడం, ప్రైవేటు రంగానికి అవసరమైన సహకారాన్ని అందించడం వంటి ప్రణాళికలను సిద్థం చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు.


సహకార సమాఖ్య విధానంలో అన్ని రాష్ర్టాలను కలుపుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్టులను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దీనికిగాను కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. గనుల విభాగంలో ఏఐ, ఆటోమేషన్‌, డ్రోన్‌ సాంకేతికతలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated Date - Aug 13 , 2024 | 04:03 AM

Advertising
Advertising
<