ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: రాష్ట్రాభివృద్ధికి కలిసి నడుద్దాం..

ABN, Publish Date - Aug 09 , 2024 | 03:45 AM

రాజకీయం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

  • రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

  • బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ జాప్యం:కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాజకీయం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ యూనిట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలతో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది. ఇందులో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒకరి ముఖాలు మరొకరు చూసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధే అజెండాగా కలిసి పనిచేయాలని చెప్పారు. ‘గాడిద గుడ్డు’ అంటూ నాయకులు మాట్లాడడం మంచి సంస్కృతి కాదన్నారు.


తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైనంత త్వరగా వరంగల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. పర్యాటకం, ఐటీ, వినోదరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ముందుకు సాగలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని 3 కమిటీలు చెప్పాయని గుర్తుచేశారు. కేంద్రం నిర్మించకపోతే తామే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బయ్యారం ఫ్యాక్టరీ లాభదాయకమైతే తానే కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకువచ్చేవాడినని తెలిపారు.


  • పార్టీలకతీతంగా పనిచేద్దాం..

రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కలిసి నడుద్దామని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. ఐఐఎం ఏర్పాటు చేస్తే తెలంగాణ యువతకు మేలు జరుగుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, లేదంటే మరే రకంగానైనా నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులపై ఒక పుస్తకం తయారు చేయించామని, బీజేపీ ఎంపీలకు కూడా ఇస్తామని పేర్కొన్నారు.


  • ఖనిజాభివృద్ధిలో ప్రైవేట్‌ రంగానిది కీలక పాత్ర: కిషన్‌రెడ్డి

ఖనిజరంగాభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. వికసిత భారత్‌-2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ఖనిజ రంగానిది ముఖ్య పాత్ర అని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఎమ్‌జీఎమ్‌ఐ(మైనింగ్‌, జియలాజికల్‌, మెటలర్జికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో గనుల రంగంపై జరిగిన జాతీయ సదస్సులో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు. భారతదేశంలో విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.


ఖనిజాల అన్వేషణ కోసం కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖనిజాల అన్వేషణ ప్రక్రియలో 50ు ఖర్చును భరించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. గనుల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. యూపీఏ హయాంలో గనుల కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో పారదర్శకత కోసం వేలం విధానాన్ని తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు.

Updated Date - Aug 09 , 2024 | 03:45 AM

Advertising
Advertising
<