మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లను గెలుచుకుంటుంది: కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:42 PM

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ భారీగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని బీజేపీ (BJP) చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. తాము చేపట్టిన14 రోజుల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ మోడీ వైపే ఉన్నామని చెబుతున్నారని అన్నారు.

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా  సీట్లను గెలుచుకుంటుంది:  కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా (చేవెళ్ల): లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ భారీగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని బీజేపీ (BJP) చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. తాము చేపట్టిన14 రోజుల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ మోడీ వైపే ఉన్నామని చెబుతున్నారన్నారు. ఈ ప్రజాసంకల్పయాత్ర పరిగి, వికారాబాద్, తాండూర్, నవపేట్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల్లో ముగించుకొని గురువారం మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి కేతిరెడ్డిపల్లి వెంకటాపూర్ గ్రామాల మీదుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్ మండలంలోకి చేరుకొంది.


Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామాల్లో ఎటు చూసినా మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. తాగునీరు, సరైన కరెంటు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ ప్రాంతంలో నీళ్ల కోసం ట్యాంకర్లు వచ్చే కల్చర్ ఉండేదని.. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాంకర్లు చూడాల్సిన పరిస్థితి దాపురించిదన్నారు. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తారని చెప్పారు.


Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం

కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చివరి వరకు నామినేషన్ వేసే వరకు ఉంటారో ఉండరో కాంగ్రెస్ నేతలకు సరైన నమ్మకం లేదన్నారు. అంగన్వాడీల పిల్లలకు ఇచ్చే గుడ్లలో కూడా రంజిత్‌రెడ్డి కల్తీ చేసి పంపిస్తారని ఎద్దేవా చేశారు. ఆయనపై ప్రజలకు నమ్మకం లేదేన్నారు. ఎన్ని స్కీములు ఇచ్చిన రంజిత్ రెడ్డిని ప్రజలుతరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.


ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 09:44 PM

Advertising
Advertising