ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే!

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:37 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

  • ఫార్ములా ఈ-కార్‌ రేసుపై కేసు అందుకే

  • సీఎం రేవంత్‌.. సర్కస్‌ నడుపుతున్నట్లుంది

  • రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా?

  • ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నిధులు.. రుణమాఫీకిచ్చాం

  • గోల్‌మాల్‌ అనిపిస్తే రద్దు చేయండి: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఫార్ములా -ఈ కార్‌ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా వెల్లడించారని పేర్కొంటూ, నిబంధనల మేరకు నిధుల బదిలీ జరగలేదని ఆయన చెప్పారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగర ప్రగతికి దోహదపడే ఏ కార్యక్రమానికైనా నిధులు ఖర్చు చేయవచ్చని హెచ్‌ఎండీఏ చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ చేపట్టే ప్రతి పనికీ ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ చాంబర్‌లో కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారును కాకుండా సర్కస్‌ నడుపుతున్నారని మండిపడ్డారు. రూ.50 లక్షలతో రేవంత్‌ దొరికితే అది ఏసీబీ కేసు అయిదని, ఫార్ములా-ఈ రేసు కేసులో రూపాయి కూడా దొరకలేదని, అలాంటప్పుడు ఈ కేసును ఏసీబీ ఎలా చూస్తుందని ప్రశ్నించారు.


ఏ కేసు ఎవరికి ఇవ్వాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. ‘‘ఓఆర్‌ఆర్‌ టోల్‌టాక్స్‌ టెండర్‌తో వచ్చిన రూ.7 వేల కోట్లను రుణమాఫీకి వెచ్చించాం. కొవిడ్‌తో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా వనరుల సమీకరణకు అప్పటి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సబ్‌ కమిటీ ఉండేది. ఆ సబ్‌ కమిటీ నిర్ణయం మేరకే ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నిధులను రుణమాఫీకి ఇచ్చాం’’ అని కేటీఆర్‌ వివరించారు. టోల్‌గేట్‌ కాంట్రాక్టు టెండర్లలో గోల్‌మాల్‌ జరిగితే.. దానిని రద్దుచేసి సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌కు సవాల్‌ చేశారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) లాగే తాము కూడా ఓఆర్‌ఆర్‌ టెండర్‌ పిలిచి నిధులు సేకరించామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ లీజులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో రేవంత్‌ చేసిన ఆరోపణపై హెచ్‌ఎండీఏ అప్పట్లో పరువు నష్టం దావా వేసిందని గుర్తుచేశారు. ఆ కేసు ఇప్పటికీ అలాగే ఉందని చెప్పారు. అసెంబ్లీలో సభ్యులపై చెప్పులు ఎలా విసరాలో కూడా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారా? అని ప్రభుత్వంపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు కనీస అవగాహన లేదని విమర్శించారు. పునశ్చరణ తరగతులు నిర్వహించాల్సింది ఎమ్మెల్యేలకే కాదు.. మంత్రులకు కూడా అని వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 21 , 2024 | 03:37 AM