ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: అమెరికా వెళ్లిన సీఎం బృందానికి శుభాకాంక్షలు..

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:25 AM

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

  • రాజకీయాలకన్నా తెలంగాణకే మా ప్రాధాన్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో వారు విజయం సాధించాలని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆకాంక్షించారు. గడిచిన పదేళ్లలో తమ ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురాగలిగిందని, తద్వారా రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తేవడంతోపాటు 24 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించగలిగామన్నారు.


ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం ఇలాంటి కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి, తమకు రాజకీయాలకన్నా.. తెలంగాణకే ప్రథమ ప్రాధాన్యమని కేటీఆర్‌ వెల్లడించారు. కాగా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో బలగం సినిమా ఉత్తమచిత్రంగా, దర్శకుడు వేణు యెల్దండి ఉత్తమ దర్శకునిగా ఎంపిక కావడంపట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆ చిత్ర బృందానికి ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు చేసిన కృషిని ప్రశంసిస్తూ.. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలమని పేర్కొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 03:25 AM

Advertising
Advertising
<