ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: ఫ్రీ బస్సు పథకం సంతోషమే... కానీ..

ABN, Publish Date - May 04 , 2024 | 09:23 PM

ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

మంచిర్యాల: ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ పనికిమాలిన పథకం వల్ల మహిళలు బస్సుల్లో కొట్టుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి.. ఆరు గ్యారెంటీలతో మోసం చేసిందన్నారు.


కరెంటు కోతలతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ చెప్పారు. నీటి సమస్య, కరెంటు సమస్యలకు కారణం కాంగ్రెస్సే అని, ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఏ ఊరికి వెళితే అక్కడి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.2లక్షల రుణమాఫీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను రద్దు చేస్తానని సీఎం అంటున్నారని.. మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.

Updated Date - May 04 , 2024 | 09:23 PM

Advertising
Advertising