KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Mar 29 , 2024 | 03:20 PM
కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నేతలు అంతా పార్టీ నుంచి వీడి వెళ్తున్నారని ధ్వజమెత్తారు.
చేవెళ్ల: కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నేతలు అంతా పార్టీ వీడి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్నం మహేందర్‌రెడ్డిని మంత్రిగా చేస్తే అందరికీ సహకరిస్తారని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుకున్నామని చెప్పారు.
అయితే సునీత, మహేందర్‌రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి తమ అభ్యర్థుల ఓటమికి కారకులయ్యారని మండిపడ్డారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి చేవెళ్ల సమావేశంలో తనకంటే కాంగ్రెస్‌ను ఎక్కువగా తిట్టారన్నారు. వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం
ఆ నేతలకు కాలమే సమాధానం చెబుతుంది...
ఆ నేతలు అన్ని మంచి మాటలు చెప్పారని... ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత వీరు పార్టీ మారడానికి ప్లాన్ చేశారని మండిపడ్డారు. పార్టీ మారిన నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పరిశ్రమలు తనవల్లే వచ్చాయని రంజిత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకొన్నా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
తాము కష్టకాలంలో ఉన్నప్పుడు కేశవరావు, కడియం శ్రీహరి మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్‌లో పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయే నేతలు రెండు రాళ్లు తమపై వేసి పోతారని మండిపడ్డారు.పెద్దలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. కాలమే ఆ నేతలకు సమాధానం చెబుతుందని అన్నారు. జీవితం మొత్తం బీసీలకు సేవ చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?
వారే లీకులు ఇస్తున్నారు...
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సిట్టింగ్ సీటు గెలవలేరు.. కానీ కేసీఆర్‌ను వంద అడుగుల లోతున పాతుతారట అని దెప్పిపొడిచారు. రేవంత్ మాటలు, భాష రోత పుట్టించేలా ఉన్నాయన్నారు. తాను ముఖ్యమంత్రిని అని రేవంత్‌రెడ్డికే నమ్మకం లేదన్నట్లుందన్నారు. ఆయన ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని.. దమ్ముంటే విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అడగొద్దని రోజుకొక కొత్త అంశంపై లీకులు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు పోయాయని.. ఇప్పుడు ఆరు గారడీలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన వాళ్లు ఇప్పుడు బాధపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ సమావేశానికి కర్నాటక నుంచి కూడా జనాలను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 13వ తేదీన చేవెళ్లలో నిర్వహించే కేసీఆర్ సభను కాంగ్రెస్ సభ కంటే ధీటుగా విజయవంతం చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..
రేవంత్ బీజేపీలోకి...
రైతుల నుంచే నిప్పు రగిలిద్దామని.. ఉద్యమం ఉధృతం చేద్దామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ ఎవరి కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి పోయే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డినేనని కేటీఆర్ చెప్పారు.
దేశంలో కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 40 ఎంపీ సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఊరు కాలదని.. పేరు లేవదన్నారు. మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే... బీజేపీకు మేలు చేసినట్లేనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు బీసీలకు కేసీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్‌ను బలోపేతం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.
Sri Bharath: పార్టీకి దూరమైన వారు తిరిగి రావాలనుకుంటే ఆదరిస్తాం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 29 , 2024 | 04:02 PM