ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: చేసిన మంచిని చెప్పుకోలేకే ఓడాం!

ABN, Publish Date - May 20 , 2024 | 04:46 AM

రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిచిందని చెప్పారు.

  • కొన్ని వర్గాలకు దూరమయ్యాం

  • 30 వేల ఉద్యోగాలపై రేవంత్‌ సొంత డబ్బా: కేటీఆర్‌

యాదాద్రి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిచిందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొన్ని వర్గాలకు దూరమయ్యామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో బీఆర్‌ఎ్‌సతో పాటు ఉద్యోగులూ భాగస్వాములయ్యారన్నారు. తెలంగాణ ఆవిర్భవించగానే 73శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, పీఆర్సీని ఏర్పాటు చేసి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించామని తెలిపారు. ఉద్యోగులకు ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా, ఒకటో తేదీన వేతనాలు రావడం లేదని దుష్ప్రచారం చేశారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్‌ అద్భుతంగా నిర్మించారని.. కానీ, ఆ గుడి పేరు చెప్పి ఏనాడూ ఓట్లు అడగలేదని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్‌ కళాశాలలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మించామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలను కేసీఆర్‌ భర్తీ చేస్తే.. వాటికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంచుతూ సీఎం రేవంత్‌డ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌ సర్కారు మాట తప్పిందన్నారు. తెలంగాణ ఆగమైందని, రుణమాఫీపై కాంగ్రెస్‌ పూటకో మాట మారుస్తోందని ఆరోపించారు. ‘ప్రత్యర్థి పచ్చి బ్లాక్‌ మెయిలర్‌.. సొల్లు కబుర్లు చెప్పే మోసగాడు.. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక రాకే్‌షరెడ్డిని గెలిపించాలన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడుసార్లు గెలించిందని, మరోసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - May 20 , 2024 | 04:46 AM

Advertising
Advertising