Kukatpally: అంతర్జాతీయ వేదికపై నగర విద్యార్థుల సత్తా
ABN, Publish Date - Aug 08 , 2024 | 05:16 AM
నగరంలోని కూకట్‌పల్లికి చెందిన లీప్ రోబోట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. ఈ మేరకు సేవ్ ది ఎర్త్ అంశంపై ఆవిష్కరించిన క్రియేటివ్ డిజైన్‌కు గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుని అబ్బురపరిచారు.
సేవ్ ది ఎర్త్‌పై క్రియేటివ్ డిజైన్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కూకట్‌పల్లికి చెందిన లీప్ రోబోట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. ఈ మేరకు సేవ్ ది ఎర్త్ అంశంపై ఆవిష్కరించిన క్రియేటివ్ డిజైన్‌కు గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుని అబ్బురపరిచారు. దక్షిణ కొరియాలోని డైజియన్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యువ రోబోట్ పోటీ (ఐవైఆర్‌సీ)లో వినూత్న రోబోలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో 20 దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
అయితే, కూకట్‌పల్లిలోని లీప్ రోబోట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు ఫార్మింగ్ మెథడ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆచరణాత్మకంగా తీసుకొచ్చే సరికొత్త రోబోను తయారుచేసి ప్రదర్శించారు. కాగా, జూనియర్, సీనియర్ క్రియేటివ్ డిజైన్ విభాగాల్లో విద్యార్థులు గ్రాండ్ ప్రైజ్‌ను కైవసం చేసుకున్నట్లు లీప్ రోబోట్ సంస్థ సీఈఓ సత్యనారాయణ మేకల తెలిపారు. విశ్వవేదికపై తమ విద్యార్థులు కనబరిచిన ప్రదర్శన అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Aug 08 , 2024 | 05:16 AM