ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: బీఆర్ఎస్ నిర్ణయంతో లాస్య నందిత కుటుంబ సభ్యుల షాక్..

ABN, Publish Date - Apr 10 , 2024 | 05:18 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కన్ఫామ్ చేసింది.

Lasya Family Members Shocked To The BRS Party Decision

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ (Congress) పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. శ్రీ గణేశ్ ఇటీవల బీజేపీకి (BJP) రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి పేరును బుధవారం నాడు ఖరారు చేసింది.


లాస్య నందిత సోదరి

దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదితకు పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించారు. నివేదిత అభ్యర్థిత్వానికి సంబంధించి స్థానిక నేతలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలతోపాటు మే 13వ తేదీన కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.


సాయన్న తర్వాత నందిత

గత ఏడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో చనిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతని పెద్ద కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. లాస్య నందిత విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో మరోసారి సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది.


ఇవి కూడా చదవండి:

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 05:19 PM

Advertising
Advertising