ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

ABN, Publish Date - May 11 , 2024 | 07:36 PM

తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.

హైదరాబాద్: తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.


ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 6గంటల నుంచి 48 గంటల పాటు మద్యం షాపులను మూసివేశారు. దీంతో మద్యం కోసం వైన్స్, బార్ షాపుల వద్ద మందుబాబులు ఎదురు చూస్తున్నారు. మళ్లీ తిరిగి మే 13వ తేదీన, పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు వైన్స్, బార్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఎన్నికల సంఘం మద్యం షాపులను మూసివేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.


ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా చేయకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ పోలీసులు షాపుల వద్ద నిఘా పెంచారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్ముతున్నా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - May 11 , 2024 | 08:17 PM

Advertising
Advertising