ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: కొలిక్కి వచ్చిన స్థానికత!

ABN, Publish Date - Jun 08 , 2024 | 03:13 AM

నీట్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన స్థానికత అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చింది.

  • ఒకటి, రెండు రోజుల్లో జీవో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లపై వైద్యశాఖ కసరత్తు

  • విభజన చట్టంలోని పదేళ్ల గడువు ముగియడంతో 15% అన్‌రిజర్వ్‌డ్‌ కోటాకు కత్తెర

  • 280 వైద్య విద్య సీట్లు.. తెలంగాణ విద్యార్థులకే

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): నీట్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన స్థానికత అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఇంజనీరింగ్‌, మెడికల్‌ అడ్మిషన్లలో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లు ఏపీ విద్యార్థులకు దక్కేవి. అదే తీరులో ఏపీలోని ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉండేది. అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన కొత్త మెడికల్‌ కాలేజీల్లో 15 శాతం అన్‌రిజ్వర్డ్‌ కోటాను గత బీఆర్‌ఎస్‌ సర్కారు రద్దు చేసింది.


కేవలం విభజన సమయానికి ఉన్న మెడికల్‌ కాలేజీల్లోని సీట్లకే ఆ 15 శాతం కోటా వర్తిస్తుందని జీవో తీసుకువచ్చింది. దీనిపై కొందరు ఏపీ విద్యార్ధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. దాంతో పాత మెడికల్‌ కాలేజీల్లోని సీట్లకే 15శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా ఇప్పటి వరకూ వర్తించింది. కాగా, విభజన చట్టంలోని పదేళ్ల గడువు ఈ నెల 2వ తేదీన ముగిసిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలకు అవకాశం ఉండదు. ఈ మేరకు స్థానికులు ఎవరన్న అంశంపైౖ సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన జీవో ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేసేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది. అయితే, ఏ ప్రాతిపదికన స్థానికతను నిర్ధారించారన్న అంశాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. జీవో విడుదలైతే గానీ ఆ విషయాలపై స్పష్టత రాదని వైద్య వర్గాలు తెలిపాయి. మొత్తంగా 280 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కుతాయని వెల్లడించాయి.


హెల్త్‌ వర్సిటీ వీసీ పోస్టుకు నోటిఫికేషన్‌

వైద్య విద్య ప్రవేశాలకు సమయం దగ్గర పడటంతో హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ పోస్టు భర్తీ ప్రక్రియను సర్కారు వేగవంతం చేసింది. వీసీ పోస్టుకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హెల్త్‌ వర్సిటీ వీసీ పోస్టు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడం ఇదే తొలిసారి. అర్హులైన అభ్యర్ధులు ఈనెల 22 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు వీసీగా కరుణాకర్‌ రెడ్డినే కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో అన్ని యూనివర్సిటీలకు కొత్తగా వీసీలను నియమిస్తోంది. అందులో భాగంగా హెల్త్‌ వర్సిటీ వీసీ పోస్టును కూడా భర్తీ చేస్తోంది.

Updated Date - Jun 08 , 2024 | 03:13 AM

Advertising
Advertising