ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Elections: టీ కాంగ్రె్‌సకు ‘మహా’ నిరాశ

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:39 AM

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రె్‌సకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సరిహద్దు రాష్ట్రం, అంతకుముందు హైదరాబాద్‌ రాష్ట్రంలో

  • మరాఠా గడ్డపై రేవంత్‌ విస్తృత ప్రచారం

  • నియోజకవర్గాల్లో ఉత్తమ్‌, సీతక్క మకాం

  • కాంగ్రెస్‌ ముఖ్య నేతలూ కార్యక్షేత్రంలోకి

  • సరిహద్దు జిల్లాల్లోనూ మహాయుతిదే హవా

  • పేరు మార్చినా.. పోటీకి నోచుకోని బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రె్‌సకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సరిహద్దు రాష్ట్రం, అంతకుముందు హైదరాబాద్‌ రాష్ట్రంలో అంతర్భాగమైన ప్రాంతం, తెలంగాణతో అనుబంధం కలిగి ఉన్న రాష్ట్రం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి మొదలుకుని టీపీసీసీ ముఖ్య నేతలంతా మహారాష్ట్రలో మకాం వేసి కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్‌ 15 సీట్లకు పడిపోవడం టీపీసీసీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేసింది. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లోనూ పొరుగు సెంటిమెంటు ఏమాత్రం పనిచేయలేదు. ఆయా ప్రాంతాల్లో మహాయుతి నేతలే భారీ మెజారిటీలతో గెలుపొందారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి మూడు విడతల్లో ప్రచారం చేశారు. గుగ్గూస్‌, రాజూర, డిగ్రామ్‌, వార్దా, సోలాపూర్‌, కడెగావ్‌, ధారావి, వర్లి తదితర నియోజకవర్గాల్లో తిరిగారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఇతర పథకాలపై అక్కడి ప్రజలకు వివరించారు. తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రె్‌సపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు.


రేవంత్‌ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కడెగావ్‌, ధారావి, వర్లి స్థానాల్లో మహా వికాస్‌ అఘాడీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఏఐసీసీ పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్‌ కమార్‌రెడ్డి మరాఠ్వాడా ప్రాంతం, మంత్రి సీతక్క ఉత్తర మహారాష్ట్ర ప్రాంత బాధ్యతలను తీసుకున్నారు. ఇద్దరూ కలిసి 80కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం వంటివి చూసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు మహారాష్ట్రలోనే మకాం వేసి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దారు. ఆ రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమిపాలు కావడం మంత్రులను నిరుత్సాహపరిచింది. మరోవైపు, కొంత మంది కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు నియోజకవర్గాల వారీగా సమన్వయ బాధ్యతలు తీసుకుని.. పది రోజులు పని చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు వారినీ నిరాశపరిచాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికే అత్యధికంగా సీట్లు రావడం, తెలంగాణతో అక్కడి ప్రజలకు ఉన్న బంధుత్వాలు ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో మహా వికాస్‌ అఘాడీకి మెరుగైన ఫలితాలే రావచ్చని పార్టీ నేతలు భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తే అనూహ్య ఓటమి ఎదురైంది.


  • పోటీకీ నోచుకోని బీఆర్‌ఎస్‌

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చిన కేసీఆర్‌.. ప్రధానంగా మహారాష్ట్రలోనే పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ శాఖను ఏర్పాటు చేసి వివిధ పార్టీల నేతలను చేర్చుకున్నారు. తెలంగాణ సీఎం హోదాలో మహారాష్ట్రలో పర్యటించి పార్టీ కార్యకలాపాలను పెంచారు. అయితే తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంతో.. మహారాష్ట్రలో ఆ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో పాగా వేయాలని భావించిన బీఆర్‌ఎస్‌.. మొన్న లోక్‌సభ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కూడా నోచుకోలేకపోయింది.

Updated Date - Nov 24 , 2024 | 04:39 AM