Seethakka: మహిళాశక్తి క్యాంటిన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి ..
ABN, Publish Date - Jun 22 , 2024 | 03:13 AM
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించే మహిళాశక్తి క్యాంటిన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని, వాటిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
దేశానికి ఆదర్శం కావాలి.. పల్లె రుచులను
పట్టణాలకు పరిచయం చేయాలి: మంత్రి సీతక్క
రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభం
మహిళాశక్తి క్యాంటిన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి
పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలి: సీతక్క
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించే మహిళాశక్తి క్యాంటిన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని, వాటిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళాశక్తి క్యాంటిన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళా శక్తి క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు ముందుకు సాగుతామన్నారు.
స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మహిళాశక్తి బిజినెస్ మోడల్‌ను రూపొందించి.. ఆర్థిక సహకారం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మ చేతి వంటలా మహిళాశక్తి క్యాంటిన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలని, పల్లె రుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి సంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు.
Updated Date - Jun 22 , 2024 | 03:13 AM