ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Knowledge City: ‘సత్వా ఎలిగ్జిర్‌’లో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:14 AM

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని సత్వా ఎలిగ్జిర్‌ అద్దాల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐటీ కారిడార్‌ ఉలిక్కిపడింది.

  • నాలుగో అంతస్తులోని రెస్టారెంట్‌లో పేలుడు

  • పేలుడు తీవ్రతతో కుప్పకూలిన సీలింగ్‌, గోడలు

  • 100 మీటర్ల వరకు దూసుకెళ్లిన అద్దాల ముక్కలు

  • సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

  • ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

  • రూ.10 కోట్ల ఆస్తి నష్టం.. ఉలిక్కిపడ్డ ఐటీ కారిడార్‌

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని సత్వా ఎలిగ్జిర్‌ అద్దాల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐటీ కారిడార్‌ ఉలిక్కిపడింది. ఆ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ‘డిస్ర్టిక్‌-51’ బార్‌ అండ్‌ కిచెన్‌ రెస్టారెంట్‌లో పేలుడు సంభవించి ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కిచెన్‌లో సిలిండర్‌ పేలిందా? లేక గ్యాస్‌ పైపులైన్‌ వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు తీవ్రతకు రెస్టారెంట్‌లోని ఇంటీరియర్‌ సీలింగ్‌ కుప్పకూలింది. భారీ ఇనుప ఫ్రేమ్‌లు సైతం విరిగి కింద పడ్డాయి. భవనం చుట్టూ ఉన్న అద్దాలు పగిలి వంద మీటర్ల మేర దూసుకెళ్లాయి.


కిచెన్‌లో గోడలు కూలిపోవడంతోపాటు రెస్టారెంట్‌ లోపల భాగంలో వస్తువులకు మంటలు అంటుకొని పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలల ధాటికి అద్దాల భవనం నాలుగు, ఐదు అంతస్తులతోపాటు మూడో అంతస్తు పాక్షికంగా దెబ్బతింది. ఎడమవైపు ఉన్న సాప్ట్‌వేర్‌ కంపెనీకి చె ందిన భవనంలో ఓ వైపు అద్దాలు ధ్వంసం కాగా, ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో చుట్టూ ఐటీ కంపెనీల భవనాల్లో పెద్దగా ఎవరూ లేకపోవడం, రోడ్లపై జనాసంచారం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సాయంత్రం జరిగి ఉంటే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని భావిస్తున్నారు. భవనం ముందు భాగంలో రోడ్డుపై, చుట్టు పక్కల కుప్పలుగా పడి ఉన్న అద్దాలను తొలగించేందుకు ప్రైవేట్‌ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారు. అగ్ని ప్రమాదంపై ఉదయం 6.12 నిమిషాలకు ఫైర్‌ స్టేషన్‌కు, 6.15 నిమిషాలకు కంట్రోల్‌ రూంకు సమాచారం అందింది. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


నాలుగు ఫైర్‌ ఇంజన్లతోపాటు బ్రాంటో స్కై లిఫ్ట్‌ ఫైరింజన్‌ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగో అంతస్తులో సీలింగ్‌ కుప్పకూలడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయినట్లు జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ ఖాజా ఖరీముల్లా, మాదాపూర్‌ ఏడీఎ్‌ఫఓ గోవర్థన్‌ తెలిపారు. అగ్ని ప్రమాదంపై సత్వ యాజమాన్యం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.10 కోట్లమేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్వా ఎలిగ్జిర్‌ భవనంలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకున్నా.. ఇంత భారీ ప్రమాదం ఎలా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్టారెంట్‌లో స్ర్పింక్లర్లు, ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ ఉన్నా గ్యాస్‌ లీకై ఎక్కువ వ్యాప్తి చెంది పేలుడు జరిగిందా, లేదా కిచెన్‌ స్టవ్‌పై ఏమైనా పెట్టి మరిచిపోవడంతో మంటలు చెలరేగాయా? అనే కోణంలో అధికారులు విశ్లేస్తున్నారు. ఉద్యోగులు, సందర్శకుల రక్షణకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేఫ్టీ ప్రొటోకాల్‌ పాటిస్తున్నామని సత్వా గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రాణాపాయం కలగలేదన్నారు. అత్యవసర బృందాలు అందుబాటులో ఉండడం, అగ్నిమాపక శాఖ సిబ్బంది త్వరగా స్పందించడంతో వెంటనే మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 05:14 AM