ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల బాహాబాహీ..

ABN, Publish Date - Jul 01 , 2024 | 03:56 AM

హరి తహారం కార్యక్రమంలో బండ్లగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ (కాంగ్రెస్‌), మాజీ మేయర్‌ (బీఆర్‌ఎస్‌) వర్గీయులు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ సమక్షంలోనే గొడవపడి కొట్టుకు న్నారు.

  • బండ్లగూడ ‘హరితహారం’లో మేయర్‌ వర్సెస్‌ మాజీ మేయర్‌

రాజేంద్రనగర్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): హరి తహారం కార్యక్రమంలో బండ్లగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ (కాంగ్రెస్‌), మాజీ మేయర్‌ (బీఆర్‌ఎస్‌) వర్గీయులు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ సమక్షంలోనే గొడవపడి కొట్టుకు న్నారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. బండ్లగూడ ఆరో వార్డులోని సన్‌ సిటీలో ఆదివారం హరిత హారం కార్యక్రమానికి కమిషనర్‌ బి.శరత్‌చంద్ర ఆహ్వానం మేరకు వెళ్లామని మేయర్‌ లతా ప్రేమ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటుతుండగా ఆ కార్యక్రమానికి, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ మాజీ మేయర్‌ మహేందర్‌ గౌడ్‌ అనుచరులు అడ్డుగా నిలబడ్డారన్నారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వారిని వారించినా వినలేదన్నారు.


అవిశ్వాసం తీర్మానంలో ఓడిపోయామన్న అక్కసుతో మహేందర్‌ గౌడ్‌, ఆయన అనుచరులు తమ పార్టీ కార్పొరేటర్లు శ్రీనాథ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌పై దాడి చేసి గాయపరిచారని చెప్పారు. మహేందర్‌ గౌడ్‌ అనుచరులు, హరీశ్‌ గౌడ్‌, శివ గౌడ్‌ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా చొక్కా పట్టుకుని లాగి దాడి చేశారని చంద్రశేఖర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హరితహారంలో పాల్గొ న్న తనపైనా అకారణంగా దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌ గౌడ్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఏసీపీ తుల శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 03:56 AM

Advertising
Advertising