ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: వరుసగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు..

ABN, Publish Date - Mar 09 , 2024 | 12:39 PM

Telangana: ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తుముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ - నరేందర్ , వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌‌లో చేశారు.

సిద్దిపేట జిల్లా, మార్చి 9: ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు (BRS) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి (Congress) చేరారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తుముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ - నరేందర్ , వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌‌లో చేశారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar).. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నియంతృత్వంతో అప్రజాస్వామ్యంగా కొనసాగిందన్నారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని.... ప్రగతి భవన్‌ను జ్యోతి రావు పులే ప్రజా భవన్‌గా (Prajabhavan) మార్చుకున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేశామని చెప్పుకొచ్చారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే 500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేశామన్నారు. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఈ ప్రజా ప్రభుత్వం మరింత ముందుకు పోవాలంటే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మరింత ముందుకు పోదామని... కేంద్రం సహకారం ఇస్తే మంచిది.. లేకపోతే బరాబర్ కొట్లాడతామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని.. దళితులకు 3 ఎకరాల భూములు ఇవ్వలేదని.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్‌తో పాటు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌కు రూ.60 కోట్ల నిధులు

YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 12:39 PM

Advertising
Advertising