Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచనతో ఓటేయండి...
ABN, Publish Date - Apr 05 , 2024 | 04:19 PM
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో కొద్దిగా ఆలోచన చేసి ఓటెయ్యాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు ఊర్ల మీద వచ్చి పడుతున్నారన్నారు. వంద రోజులు దాటినా రుణమాఫీ చేయని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని అన్నారు.
మెదక్, ఏప్రిల్ 5: పార్లమెంటు ఎన్నికల్లో (Loksabha Elections) కొద్దిగా ఆలోచన చేసి ఓటెయ్యాలని మాజీ మంత్రి హరీష్‌రావు (Former minister Harish Rao) అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు ఊర్ల మీద వచ్చి పడుతున్నారన్నారు. వంద రోజులు దాటినా రుణమాఫీ చేయని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని అన్నారు.
AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు
రెండు లక్షల రుణమాపి అయిన వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయాలని ... మాఫీ కాని వాళ్లు కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు. రూ.2500కు ధాన్యాన్ని కొనకపోతే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే వలసల మీద దృష్టి పెట్టాడు రేవంత్ అంటూ విమర్శించారు. కేశవరావు , దానం నాగేందర్‌లు.. రెడ్డి ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. పంటకోతకు వచ్చిన ఇప్పటికి రైతుబంధు పడలేదన్నారు. కాంట్రాక్టర్‌కు కమిషన్లకు ఇస్తున్నారు కానీ రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన ప్రతి మాట తుంగుల తొక్కి మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
USA: నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కళ్యాణి ముడుంబ
30 వేల ఉద్యోగాలు తాము ఇచ్చామని... నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెసోళ్లు ఇచ్చారన్నారు. జూటా మాటల కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే అని అన్నారు. 39 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీని నిద్ర పోనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అమలు చేసేంత వరకు వెంటపడతామని స్పష్టం చేశారు. పేదరికం పెరిగిందని ... నిరుద్యోగం పెరిగిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత రూపాయి విలువ పడిపోయిందన్నారు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ పార్టీ అని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి కట్టాడు కానీ ఓట్లు అడగలేదని.. రాజకీయం చేయలేదన్నారు. కానీ బీజేపీ రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని హరీష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల.. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడంటే?
AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 05 , 2024 | 04:47 PM