ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaggareddy: నేను గెలిస్తే అసెంబ్లీలో ఆ ఇద్దరితో ఆడుకునేవాడిని

ABN, Publish Date - Jan 05 , 2024 | 08:56 PM

తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ ( BRS ) నేతలు కేటీఆర్ ( KTR ), హరీష్‌రావు (Harish Rao )ను ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీష్‌రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదన్నారు. బెంజ్ కార్లలో తిరిగే బావబమ్మర్ధులకి పేదల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ అక్రమ పాలన చేస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ ( BRS ) నేతలు కేటీఆర్ ( KTR ), హరీష్‌రావు (Harish Rao )ను ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీష్‌రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదన్నారు. బెంజ్ కార్లలో తిరిగే బావబమ్మర్ధులకి పేదల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ అక్రమ పాలన చేస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని చెప్పారు. సెక్రటేరియట్‌లో తొమ్మిదేళ్ళు ఫైళ్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు వాటి బూజు దులుపుతున్నారన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్‌లకు లేదన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు అప్పులు చేశారని.. వాటిని ఎలా తీర్చాలా అని మా మంత్రులు తలపట్టుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా ప్రశ్నించారు. కేబుల్ బ్రిడ్జి కట్టిన బీఆర్ఎస్ నేతలే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్సార్ ఇంకెంత చెప్పాల్సి ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్‌రావుల కోసం 840 చట్టం తేవాలేమోనని జగ్గారెడ్డి చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 08:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising