BRS: తమ్ముడి అరెస్టుపై కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ABN, Publish Date - Mar 15 , 2024 | 11:29 AM
Telangana: సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో తమ్ముడు మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌పై పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి మహిపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముడి అరెస్ట్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా, మార్చి 15: సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో తమ్ముడు మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌పై పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) స్పందించారు. శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి మహిపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముడి అరెస్ట్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి (YSR) సీఎంగా ఉన్న సమయంలో లక్డారం క్వారీ అనుమతులు తీసుకున్నామని.. క్వారీని గతంలోనే లీజుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) ఇబ్బందులకు గురిచేయటం జరుగుతుందని మండిపడ్డారు. తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయాలని.. నోటీసు ఇవ్వాలని.. అంతేకాని దొంగలు లెక్క తెల్లవారుజామున 3 గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం చట్ట విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచానని.. తాను తప్పు చేస్తే ప్రజలు బండకేసి కొట్టేటోళ్లని చెప్పుకొచ్చారు. అన్ని పర్మిషన్లతో క్రషర్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
YSRCP: అవంతి శ్రీనివాస్ వార్నింగ్‌కు గట్టి సమాధానమే ఇచ్చిన యువకులు
మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అక్రమం: హరీష్‌రావు (Harish Rao)
కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనికి టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఒప్పుకోక పోతే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం అక్రమమన్నారు. అరెస్టు చేసేటప్పుడు ప్రొసిజర్ ఉంటుందని.. ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయటం ఘోరమన్నారు. పదేళ్లలో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. బెయిలబుల్ అఫెనెన్స్ ఉన్నా ఏదో విధంగా క్యారెక్టర్ డామేజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. జిల్లా మంత్రి రాజనర్సింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మూడునెలల కాల వ్యవధిలో మూడవ కేసు పెట్టారన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. ప్రతిపక్షాలపై గ్లొబెల్ ప్రచారం చేస్తూ.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అన్ని అనుమతులు ఉన్నా వేధించే కార్యక్రమం చేయటం తప్పు అని.. న్యాయస్థానానికి వెళతామని.. న్యాయపోరాటం చేస్తామని హరీష్‌రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: సమ్మర్ ఎఫెక్ట్.. గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో పెరిగిన విద్యుత్ డిమాండ్
Supreme Court of India: ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్.. ఎస్‌బిఐకి నోటీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 15 , 2024 | 11:29 AM