ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మెట్రో బంపరాఫర్.. ప్రయాణికులకు ముందే పండగొచ్చిందహో!

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:31 PM

ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.

హైదరాబాద్: ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.


ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పొడిగించినట్లు తెలిపారు. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డుతో సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చని వివరించారు.


కాగా ఈ రాయితీలు కొంతమంది సందర్శకులకు ఎంతో ఉపయోగం. సెలవు దినాల్లో వినోద యాత్రలకు మెట్రోలో వెళ్తే తక్కువ ఖర్చు అవుతుండటంతో ప్రయాణికులు ఈ రాయితీలను భారీగా వినియోగించుకునేవారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మెట్రో యాజమాన్యం గతంలో కూడా ఈ ఆఫర్లను ప్రకటిస్తూ ఉండేది. ఇప్పుడు వేసవి సెలవులు, ఉగాది పండుగ దృష్ట్యా ఈ రాయితీలను మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రకటనతో సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 08 , 2024 | 07:53 PM

Advertising
Advertising