ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్‌వే: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN, Publish Date - Jun 02 , 2024 | 09:53 PM

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.

Minister Jupalli Krishna Rao

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతికంగా గెలిచిందన్నారు.

కేసీఆర్ 2018లో ప్రతిపక్షమే ఉండొద్దని చేసినట్లు తాము చేస్తే, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమని.. కాని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా అనుకోలేదు కాబట్టే వాళ్లు గెలిచారని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది తెలిసిపోతుందన్నారు. శాసనసభ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను కాపాడుకున్నాం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ది మూడో స్థానమేనని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. సముద్రంలో మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికినా ఆనంద పడుతారని.. సేమ్ బీఆర్ఎస్ పరిస్థితి కూడా రాష్ట్రంలో అలాగే ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను కాపాడుకున్నామన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అద్భుతంగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉద్యమకారులను సత్కరించలేదన్నారు. కోడ్ తర్వాత ఉద్యమకారులను పిలిచి గౌరవిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: అందుకే అమెరికాకు హరీశ్‌రావు .. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు

Telangana Formation Day: అవి గుర్తుకు వస్తే దుఃఖం వస్తుంది: కేసీఆర్

Telangana State Formation Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్

For more Telangana News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 09:57 PM

Advertising
Advertising