ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

ABN, Publish Date - Oct 08 , 2024 | 11:00 AM

మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్: మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. సోమవారం హయత్‌నగర్‌ మదర్‌డెయిరీ కార్యాలయంలో జరిగిన చైర్మన్‌ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యతో కలిసి నూతన చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో గందరగోళం...


అనంతరం మిఠాయి తినిపించి కూర్చిలో కుర్చోబెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న మదర్‌డెయిరీని లాభాల్లో తీసుకురావడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఉద్యోగులు, కార్మికులు కలిసికట్టుగా పని చేస్తే మదర్‌డెయిరీ లాభాల బాటలో పయనిస్తుందన్నారు. మదర్‌డెయిరీ ఉత్పత్తులు నాణ్యతకు మరోపేరు అని అన్నారు. తెలంగాణాలోని దేవాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్ధలకు పాలు, నెయ్యి సరఫరా చేస్తామన్నారు. మదర్‌ డెయిరీ విషయంపై మరో మారు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు.


చైర్మన్‌, పాలకవర్గం సభ్యులు కష్టపడి రైతులకు మేలు జరిగేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, మదర్‌డెయిరీ ఎండీ కృష్ణ, పాలకవర్గం సభ్యులు జయశ్రీ, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, జలేందర్‌రెడ్డి, అలివేలు, శ్రీధర్‌రెడ్డి, పాండు, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, నర్సింహులు, జంగయ్య, నర్సింహారెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.........................................................................

MLA: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- బీఆర్‌ఎస్‌ హయాంలోనే నగరాభివృద్ధి జరిగింది..

- రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి మహానగరాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌(MLA KP Vivekanand) అన్నారు. సోమవారం సూరారం డివిజన్‌లోని షాపూర్‌నగర్‌లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని నాయకులు, అధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానగరం అభివృద్ధిలో భాగంగా నగరంలో 54 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ నిర్మాణాలు చేపట్టారన్నారు.


హైదరాబాద్‌ అభివృద్ధి అంటే సీఎం రేవంత్‌రెడ్డికి మూసి మాత్రమే కనబడుతోందని, పదినెలల్లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలుస్తూ పాలన గాలికి వదిలేశారన్నారు. అభివృద్ధి అంటే కేవలం మూసీనే కనబడుతుందా లేక నగరంలో రోడ్ల దుస్థితి, నాలాల పరిస్థితి, మురుగునీటి సమస్య కనబడడం లేదా అని ప్రశ్నించారు. షాపూర్‌నగర్‌ చౌరస్తాలో నిత్యం వేలాది మంది పాదాచారులు, కార్మికులు రోడ్డు దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


వీరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఎట్టకేలకు బ్రిడ్జిని ప్రారంభించడంతో పాదాచారుల సమస్య తీరడం హర్షణీయమన్నారు. కార్పొరేటర్‌ మంత్రి సత్యన్నారాయణ, మాజీ కార్పొరేటర్‌ సురే్‌షరెడ్డి, యూత్‌ నియోజకవర్గం అధ్యక్షుడు సోమేష్ యాదవ్‌, రుద్ర అశోక్‌, పుప్పాల భాస్కర్‌, శ్రీకాంత్‌ నాయకులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!

ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 08 , 2024 | 11:00 AM