ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: ఆ పార్టీ మోసాలు బయటకు వస్తున్నాయి: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Mar 30 , 2024 | 05:22 PM

గత బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు.

హైదరాబాద్: గత బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు ఏమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

TG Politics: బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుంది: మహేశ్వర రెడ్డి

బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ (Congress) పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారం వచ్చాక కులగణన చేపట్టామని తెలిపారు. 16 కులాలకు కార్పొరేషన్లు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ తమకుందని చెప్పారు. 23 ఏళ్లలో బీఆర్ఎస్‌లో బలహీన వర్గాలకు ఏ ఒక్కరికి న్యాయం చేయలేదన్నారు. బీజేపీ బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డి‌కి ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసే ముందు కేటీఆర్ వొళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 05:22 PM

Advertising
Advertising