ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Seethakka : నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:23 AM

‘పోడు భూములకు హక్కుల కోసం పోరాడిన నా తండ్రి జైలుకు పోయొచ్చిండు.. నేను ఎమ్మెల్యేనైనా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా.. నా తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతరు.. ఇప్పటికీ నా తండ్రి అడవినే నమ్ముకొని రోజూ పనిచేస్తడు..’

  • వారికి అటవీ హక్కు చట్టం కింద పోడు భూమి పట్టా వచ్చింది

  • అది దానం కాదు.. హక్కు: సీతక్క

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యకు కౌంటర్‌

  • ఒకే రోజు 19 పద్దులపై చర్చా?: కేటీఆర్‌

హైదరాబాద్‌/ములుగు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ‘పోడు భూములకు హక్కుల కోసం పోరాడిన నా తండ్రి జైలుకు పోయొచ్చిండు.. నేను ఎమ్మెల్యేనైనా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా.. నా తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతరు.. ఇప్పటికీ నా తండ్రి అడవినే నమ్ముకొని రోజూ పనిచేస్తడు..’ అని ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సీతక్క తండ్రికి గత ప్రభుత్వం పోడు పట్టా ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అసెంబ్లీలో ప్రస్తావించగా ఆమె స్పందించారు.

2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హత ఉన్నందుకే తన తండ్రి పేరిట ఎకరం 17 గుంటల భూమికి హక్కు పట్టా వచ్చిందని, తన కుటుంబానికి ఎవరూ దానం ఇవ్వలేదని బదులిచ్చారు. అడవే ఆధారంగా బతికే కుటుంబాలు తమవని చెప్పారు. తాను ఆదివాసీ అయినందుకే తన తల్లిదండ్రుల పోడు భూమి పట్టాపై బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు రైతుబంధు తీసుకున్నారన్నారు. 2006లో కాంగ్రెస్‌ సర్కారు తెచ్చిన పోడు భూముల చట్టంతో ఎస్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందికి ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. 2018లో తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగా ఆ ఐదేళ్లూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా నియోకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదని, ఆవేదనతో కోర్టును ఆశ్రయించానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల్లో ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నిధులన్నీ ఖమ్మం, నల్లగొండ జిల్లాలకే వెళుతున్నాయన్నారు.

ఒకే రోజు 19 పద్దులపై చర్చా?: కేటీఆర్‌

ఒకే రోజు 19 పద్దులను చర్చకు పెట్టి, వాటి ఆమోదానికి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు అసెంబ్లీ నిర్వహించడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఈసారి సభలో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు అడుగుపెట్టారని, వారందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో రోజుకు రెండు మూడు పద్దులు మాత్రమే పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సభ సజావుగా జరిగేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.

Updated Date - Jul 31 , 2024 | 06:23 AM

Advertising
Advertising
<