ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Uttam: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 08:55 PM

రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.

సూర్యాపేట: రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...మాజీ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ ఏడాది 3500 ఇళ్ల నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. హుజూర్ నగర్‌లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అందరం కలసి బయటికి తెచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. కాళేశ్వరంలో చేసినా తప్పుడు విధానాలతో ప్రస్తుతం నీళ్లున్నా వాడుకోలేక పోతున్నామని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వ తప్పులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. భద్రాద్రి, యాదాద్రి పేరుతో దోచుకోవడానికి ప్రచారంలో బాగా వాడుకున్నారని మండిపడ్డారు. ధరణిలో ఎలా ల్యాండ్ మాయ చేశారో త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది: మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్: సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కలవటం శుభపరిణామమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సి ఉందని... అందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 08:55 PM

Advertising
Advertising