ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్న ప్రభుత్వాలు: హరీశ్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:25 AM

ఈడీ, ఐటీల పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

పటాన్‌చెరు, జూన్‌ 21: ఈడీ, ఐటీల పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తదితరులు పటాన్‌చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి కుటుంబాలను శుక్రవారం కలిసి ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపారు.


వారి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఈడీ, ఐటీలను ప్రయోగించినా, ఎంత ఒత్తిడి చేసినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లొంగే ప్రసక్తే లేదన్నారు. మహిపాల్‌రెడ్డి వద్ద ఎలాంటి అక్రమాస్తులు లేవని ఈడీ సోదాల్లో తేలిందన్నారు. ప్రతీ ఆస్తికి లెక్కలు చూపించి ప్రభుత్వానికి ఐటీ చెల్లింపులు చేస్తున్న మహిపాల్‌రెడ్డి ఎవరి ముందు తలవంచరని పేర్కొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 03:25 AM

Advertising
Advertising